VZM: గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని SP దామోదర్ సూచించారు. గరివిడి మండలం కాపుశంభంలో గురువారం నిర్వహించిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, కుల, మత వివక్షకు తావివ్వకుండా సమైక్యతతో మెలగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల సహకారం అవసరం'


