హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూసేకరణపై జేసీ ఆధ్వర్యంలో 3G విచారణ

ATP: జాతీయ రహదారి 544D నిర్మాణానికి అదనపు భూసేకరణకై జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆధ్వర్యంలో 3G బహిరంగ విచారణ చేపట్టారు. రైతుల హక్కు పత్రాలను పరిశీలించి భూమి హక్కులు నిర్ధారించారు. నష్టపరిహారం, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని జేసీ తెలిపారు. తహశీల్దార్లు రామచంద్ర, బాలమ్మ పాల్గొన్నారు.