హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్ల కిందే విద్యార్థుల భోజనం..!

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం కె.శివడ గ్రామంలోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులు ఇరుకైన గదుల్లో చదువుతున్నారు. పాత పాఠశాల భవనం కూలిపోవడంతో కొన్నేళ్లుగా అదనపు భవనంలోనే తరగతులు కొనసాగుతున్నాయి. గాలి, వెలుతురు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా, మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక స్థలం లేక చెట్ల కిందే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది.