హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో బ్రాహ్మణ సొసైటీ వార్షికోత్సవం

కృష్ణ: మచిలీపట్నంలో బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ రూ.25 కోట్లతో ప్రారంభమైన సొసైటీ ప్రస్తుతం రూ.270 కోట్ల టర్నోవర్‌కు చేరడం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో పి.వి. ఫణికుమార్, గోర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.