హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా చూడాలి'

కృష్ణా: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో దోమల నివారణపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ నివారణ ప్రతిజ్ఞ చేయించారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దోమల పుట్టుకను అరికట్టేందుకు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు.