హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఐదుగురికి జరిమానా

PLD: నకరికల్లు ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురు ద్విచక్ర వాహనదారులను గురువారం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన మెజిస్ట్రేట్, నిందితులు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 50,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.