హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన విద్యార్థులు

కృష్ణ: బాపులపాడు మండలం వీరవల్లి గీతాంజలి హైస్కూల్‌ విద్యార్థులు గురువారం రాష్ట్ర శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభా కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల చర్చలను ఆసక్తిగా పరిశీలించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విద్యార్థులను పలకరించి, శాసనసభ విధులు, ప్రజాస్వామ్యంలో దాని ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.