హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిథిలావస్థలో రెవెన్యూ కార్యాలయాలు.!

TPT: సత్యవేడు, నాగలాపురం, నారాయణవనం మండల రెవెన్యూ కార్యాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. సత్యవేడు, నాగలాపురంలోని తహసీల్దార్‌ కార్యాలయాలు శిథిలావస్థకు చేరడంతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రికార్డులు తడిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణవనం రెవెన్యూ నిర్మాణం పునాదులకే పరిమితమైందని, కొత్త భవనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.