హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలపై దొండవాకలో 'వన్ మంత్- వన్ విలేజ్'

KKD: ప్రభుత్వ ఆదేశాల మేరకు 'వన్ మంత్– వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్' కార్యక్రమం గురువారం తుని మండలం దొండవాకలో నిర్వహించారు. తహసీల్దార్ జి.వి.ఎస్. ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలు, రైతుల భూ సమస్యలను పరిశీలించారు. పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, వీఆర్ తదితరులు పాల్గొన్నారు.