ELR: నూజివీడు రూరల్ సీఐ కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. స్టేషన్లలోని రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలతో నేరస్తులను త్వరగా గుర్తించవచ్చన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల మాయలో పడి రైతులు మోసపోవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మోసపూరిత వ్యాపారులపై జాగ్రత్త: ఎస్పీ


