హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ పశు రవాణా.. 9 మంది అరెస్ట్

KKD: తుని పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా అలమండ నుంచి జగ్గంపేటకు తరలిస్తున్న మూడు వాహనాలను జాతీయ రహదారిపై తనిఖీ చేశారు. రెండు బొలెరో ట్రక్కులు, ఒక ఐచర్ ట్రక్కులో 27 ఎద్దులు, 11 దున్నపోతులు ఉన్నట్లు గుర్తించారు. వాహనాలను స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.