కుల్దీప్ యాదవ్‌కు జట్టు యాజమాన్యం అండగా నిలవాలని అజింక్య రహానే అన్నాడు. తొలి టెస్టులో విఫలమైనంత మాత్రాన అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ సరికాదన్నాడు. కుల్దీప్ మ్యాచ్ విన్నర్ అని, క్లిష్ట సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌లను గెలిపిస్తాడని తెలిపాడు. ప్రస్తుతం అతడికి జట్టు యాజమాన్యం ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలని పేర్కొన్నాడు.
క్రీడలు
కుల్దీప్‌కు అండగా నిలవాలి: రహానే


