హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాపై అధికారుల తనిఖీ

W.G: ఉండి ఎంపీడీవో కార్యాలయాన్ని జడ్పీ సీఈవో పి. జగదాంబ గురువారం తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 18 నుంచి 24 వరకు ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాల నమోదు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 7న తుది జాబితా ప్రకటిస్తామన్నారు.