హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వ్యాధులపై ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ'

KDP: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాసనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. గీతా మాట్లాడుతూ దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.