హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీవో 97ను వెంటనే రద్దు చేయాలి'

MHBD: పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం చేసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు. SFI ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బానోత్ సింహాద్రి, గుండ్ల రాకేష్, తిరుమల, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.