హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో రేపు ప్రజా దర్బార్ కార్యక్రమం

ప్రకాశం: గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకు నేరుగా అందజేయవచ్చని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ కార్యాలయం సూచించింది.