PPM: బలిజిపేట మండలంలోని గంగాడ, గలావిల్లి గ్రామాల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిన మోహన్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


