హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరలక్ష్మి వ్రతం..కొండెక్కిన పూల ధరలు

KMR: రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దుకాణాలకు ముందుగానే పూలు కొనుగోలు చేసేందుకు మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. పండగను ఆసరాగా చేసుకుని ధరలు పెంచారని కొనుగోలుదారులు వాపోతున్నారు. మల్లె కిలో రూ.1,200, చామంతి రూ.800, గులాబీ రూ.300, బంతి పూలు రూ.150 వరకు పలుకుతున్నాయి.