హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవినీతి ఆరోపణలు.. ఎంఈవోపై ఫిర్యాదు

ASR: అనంతగిరి ఎంఈవో కే.బాలాజీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. ఈమేరకు గురువారం డీటీఎఫ్, ఏపీటీఎఫ్-257, పీఆర్‌టీయూ, బీటీఏ సంఘాల ప్రతినిధులు డీఈవో భానుమూర్తిరాజుకు సంబంధిత ఆధారాలు, ఫిర్యాదులను అందజేసినట్లు తెలిపారు. సిబ్బంది వేతనాలు, విద్యార్థుల సంక్షేమ పథకాలు తదితర అంశాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు.