హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట

RR: అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద GO 97 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి, దుర్భాషలాడారని విద్యార్థులు ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.