హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినికి ఉపాధ్యాయుడి ఆర్థిక సాయం

BPT: ఇంకొల్లు (మం) దుద్దుకూరు ఆచార్య రంగా జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి, ప్రమాదవశాత్తు తండ్రిని కోల్పోయిన విద్యార్థిని M. అన్వితకు భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కే. శ్రీనివాస కుమార్ అండగా నిలిచారు. ఆమె ఉన్నత చదువుల నిమిత్తం ఆయన రూ.22,000 ఆర్థిక సాయం అందించారు. అన్విత భవిష్యత్తులో మరింత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.