హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొండా సుస్మిత వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష

JN: సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కంచ రాములు జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద 48 గంటల నిరాహార దీక్షను గురువారం చేపట్టారు. సుస్మిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.