హైదరాబాద్: 28°C
తెలంగాణ

'24 నుంచి నూతన ఐడీఓసీలో ప్రజావాణి'

MLG: ఆగస్టు 24 నుంచి ప్రతి సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజలు తమ సమస్యలు, వినతులు, దరఖాస్తులు సమర్పించాలన్నారు. నూతన ఐడీఓసీలో ప్రజావాణి నిర్వహించే మార్పును ప్రజలు గమనించాలన్నారు.