NRML: కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న అన్నారు. గురువారం గాంధీ పార్క్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కార్మికులకు వేతనం అనేది ప్రాథమిక అవసరాలను తీర్చడానికి వారి ఆరోగ్యం పని గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి సరిపోయేలా ఉండాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి'


