ADB: గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ
గుడిహత్నూర్‌లో బోల్తాపడిన లారీ


