BHNG: ప్రభుత్వాలు మారుతున్నా బీబీనగర్ మండలం రుద్రవెళ్లి వద్ద మూసీ నదిపై వంతెన నిర్మాణం మాత్రం పూర్తికావడం లేదు. ఇటీవల భువనగిరి MLA వంతెన నిర్మాణానికి రూ.18.5 కోట్లు మంజూరైనట్లు ప్రకటించినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో వంతెన పూర్తయ్యేదెన్నడోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
రుద్రవెల్లి మూసీ వంతెన పూర్తయ్యేదెన్నడో?


