VKB: వర్షాలతో రావులపల్లి–కుడుగుంట నుంచి మర్పల్లి వెళ్లే మార్గం కంకర, రాళ్లతో పూర్తిగా దెబ్బతింది. రహదారి అధ్వానంగా మారడంతో ఆటోలు రాక విద్యార్థులు కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అధ్వానంగా రావులపల్లి–కుడుగుంట రోడ్డు


