హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌రే స్కానర్ ఏర్పాటు

HNK: రైల్వే ప్రయాణికుల భద్రతను పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కాజీపేట రైల్వే స్టేషన్‌లో సామగ్రి, పార్శిళ్ల తనిఖీ కోసం ఎయిర్‌పోర్టు తరహా ఎక్స్‌రే స్కానర్ ఏర్పాటు చేశారు. కన్వేయర్ బెల్ట్‌తో కూడిన ఈ స్కానర్ ద్వారా నిషేధిత వస్తువులు, ఆయుధాలు, అనుమానాస్పద సరుకులను గుర్తించే అవకాశం ఉంది. దీంతో స్టేషన్‌లో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.