హైదరాబాద్: 28°C
క్రీడలు

జడేజా రోల్ పూర్తిగా మారిపోయింది: అశ్విన్

జడేజా బౌలింగ్ శైలిపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జడేజా ఇకపై టీమిండియాకు ప్రధాన అటాకింగ్ స్పిన్నర్ కాదని, అతని పాత్ర ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్నాడు. బ్యాటింగ్‌తో పాటు బంతితో తన అనుభవాన్ని అందించే మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రూపాంతరం చెందాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం జడేజా సీనియర్ ఆల్‌రౌండర్‌గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడని ప్రశంసించాడు.