హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంటాయపాలెంలో విద్యుత్ సమస్యలపై సమీక్ష

MHBD: MLA మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు కంటాయపాలెంలో విద్యుత్ శాఖ ఏడి అశోక్, ఏఈ మహేష్ గ్రామస్తులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ఫీడర్, త్రీఫేజ్ విద్యుత్, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, కేబుల్స్ తదితర సమస్యలను గ్రామస్తులు వారి దృష్టికి తీసుకెళ్లారు. నెల రోజుల్లో పలు సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో సెక్రెటరీ పాల్గొన్నారు.