హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి ఆత్రం సుగుణ పరామర్శ

ASF: జైనూర్ మండలం గూడమామడలో బుధవారం ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఉపసర్పంచ్ సలీం కుమారుడు రహేల్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ గురువారం రహేల్ నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరితో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.