హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలు.!

ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలు జరగనున్నాయి. 16 రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు వస్తున్నట్లు నిర్వాహకులు గోపీనాథ్, తాళ్లూరి వేణు తెలిపారు. 28న భారీ ప్రదర్శన ఉంటుందని, సభలో భూ సమస్యలు, గిట్టుబాటు ధరలు, రుణమాఫీపై చర్చిస్తారని వెల్లడించారు.