హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో 97ను రద్దు చేయాలని నిరసన

MDK: చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇతర విద్యాసంస్థల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చేగుంట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గురువారం ధర్నా చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ ప్రత్యేకతను దెబ్బతీసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.