హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘పొంగులేటి రాజీనామా చేయాలి’

MDK: భూభారతిలో అక్రమాలు, 22ఏ భూముల వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కొమురయ్య డిమాండ్ చేశారు. బీజేఎల్పీ నేత మహేంద్రరెడ్డి ఆధ్వర్యంలో గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. యాదగిరిగుట్టలోని 42 ఎకరాల భూమి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.