హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రూ.70లక్షలతో నూతన రోడ్డు నిర్మాణం'

 కృష్ణ: చల్లపల్లిలో రూ. 70 లక్షల వ్యయంతో నూతన తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. నడకుదురు రోడ్డులో 0/0 నుంచి 1/0 కిలోమీటర్ వరకు 1 కి.మీ పొడవున, 5.50 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మించారు. దీంతో కోమలానగర్, శ్రీనగర్ వాసులు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ప్రయాణికులకు రాకపోకలు సులభతరమయ్యాయి. ఆర్‌అండ్‌బీ డీఈఈ ఎం. రమేష్ పర్యవేక్షించారు.