హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్ల పథకం.. దరఖాస్తులకు ఆహ్వానం

WNP: జిల్లాలో బీసీ మహిళలకు స్వయం ఉపాధి కోసం ‘ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం అమలు చేస్తున్నారు. 18–55 ఏళ్ల అర్హులు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉండాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మధు తెలిపారు.