NRML: నిర్మల్ మండలం తల్వేద గ్రామపంచాయతీలో గురువారం తడి పొడి చెత్త బుట్టలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీవో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సంరక్షణలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామస్తులకు తడి-పొడి చెత్త బుట్టల పంపిణీ


