AKP: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 82వ జయంతిని పూడిమడకలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తనకాల అనంతరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ శాస్త్ర,సాంకేతిక రంగాల అభివృద్ధికి కృషి చేశారని, దేశ సమగ్రత, సామరస్యత కోసం పాటుపడ్డారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రాజీవ్ ఆశయాల సాధనకు కృషి'


