హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాచూర్‌లో హెల్త్ క్యాంప్.. ఆరోగ్యంపై అవగాహన

KMR: రాచూరులో డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు స్థానిక వైద్య సిబ్బందితో గ్రామంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల అందజేసినట్లు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతకు పాటించాల్సిన విషయాలపై వివరించారన్నారు.