హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఆధార్ సేవా కేంద్రం' ప్రారంభం

నల్గొండ హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఆధార్ సేవా కేంద్రాన్ని'మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో ఇది ఐదో కేంద్రమని, దీనివల్ల ప్రజలు హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఆధార్ సేవలు పొందవచ్చని తెలిపారు. ఆధార్ నమోదు, సవరణలను సకాలంలో చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.