హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనంతారంలో రేషన్ కార్డుల పంపిణీ

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలోని రేషన్ షాప్ వద్ద అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. ఎమ్మార్వో రాచకట్ల సురేష్, సర్పంచ్ వోల్లాల రజిత వెంకటేశం కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేషన్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.