హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్ కార్మికుల ధర్నా.. సూపర్‌వైజర్‌ల తొలగింపునకు డిమాండ్

ADB: కార్మికులను అసభ్యంగా దూషించిన సూపర్‌వైజర్లు నగేష్, ఇర్ఫాన్‌లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ వారిని తొలగిస్తామని హామీనిచ్చారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే శనివారం మళ్లీ ధర్నా చేపడతామని కార్మికులు హెచ్చరించారు.