హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

NLG: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా మిర్యాలగూడలో వేడుకలు నిర్వహించారు. ఎస్పీ కన్వెన్షన్ హాల్‌లో కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మండలి విప్ ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.