హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంజీవని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

MBNR: శ్రీ సంజీవని ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని డాక్టర్ బాల శ్రీనివాస్ తెలిపారు. అనంతరం దాతలకు పండ్లు పంపిణీ చేశారు.