హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆలయానికి కనీస వసతులు కల్పించండి'

BDK: కరకగూడెం మండలం సీతారాంపురం గ్రామం సారలమ్మ గుడికి కనీస మౌలిక వసతులు లేక భక్తులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదివాసి జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ అన్నారు. ప్రధాన రహదారి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న సారలమ్మ ఆలయానికి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో భక్తులు గుడికి ఎలా చేరుకోవాలో అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.