హైదరాబాద్: 28°C
తెలంగాణ

AMO పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

WGL: జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఖాళీ అయిన అకాడమీక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంవో) పోస్టుకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా డీఈవో బి.రంగయ్య నాయుడు కోరారు. 5 ఏళ్ల అనుభవం కలిగిన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈనెల 21 లోపు డీఈవో ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.