హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజీవ్‌ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం'

BDK: దేశాభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని TPCC సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ SJK అహ్మద్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా పాల్వంచ రాజీవ్ గాంధీ మార్కెట్‌లోని ఆయన విగ్రహానికి అహ్మద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సాంకేతిక పురోగతికి రాజీవ్‌గాంధీ పునాది వేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.