హైదరాబాద్: 28°C
తెలంగాణ

PPP విధానంపై BRSV ఫైర్

RR: మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై BRSV ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. BRSV రాష్ట్ర కార్యదర్శి షేర్ రమణ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడొద్దని, GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. PPP విధానంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.