NZB: ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.28–30 లక్షల వరకు ఎరువుల విక్రయ నగదు దుర్వినియోగం జరిగినట్లు అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు ఆరోపిస్తూన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బోధన్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అలాగే రైతు బీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించి, రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'ఎరువుల దుర్వినియోగంపై విచారణకు డిమాండ్'


