హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

ADB: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. పరుగు, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, షాట్ పుట్ త్రో క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలు ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.